భారతదేశం, ఆగస్టు 4 -- ఇటీవల వేరేవారితో సంబంధం కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని కడతేర్చే ఘటనలు చాలానే చూస్తున్నాం. రోజురోజుకు కొత్త పద్ధతుల్లో రక్త సంబంధీకులనే చంపేస్తున్న వార్తలు అనేకం వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులనే మధ్యలో వచ్చిన బంధం కోసం దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 12వ తరగతి బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో తండ్రిని హత్య చేయించింది.

హర్యానాలోని సోనేపట్ జిల్లాలోని ఒక గ్రామ శివారులోని అడవిలో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని ఐదురోజుల కిందట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు చంపేశారు అని దర్యాప్తు చేయగా విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 12వ తరగతి చదువుతున్న కుమార్తె, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

కుండ్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సేథి మాలిక్ తెలిపిన వ...