భారతదేశం, డిసెంబర్ 24 -- హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), చిక్కడపల్లి పోలీసులతో కలిసి డిసెంబర్ 24, 2025 బుధవారం నగరంలోని చిక్కడపల్లిలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సహా ముగ్గురు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిరి అరెస్టు చేశారు. ఒక కస్టమర్‌ను కూడా ఈ సందర్బంగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల గురించి విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. పోలీసులు 22 గ్రాముల OG (హైడ్రోపోనిక్ గంజాయి), MDMA, 5.57 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, ఆరు LSD బ్లాట్‌లు, రూ.50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తో కలిపి మెుత్తం విలువ రూ.3,12,980 ఉంటుందని అంచనా.

నిందితులను ఉమ్మిడి ఇమ్మానుయేల్ (25), ఈవెంట్ మేనేజర్‌గా గుర్తించారు. చోడవరపు సుస్మితా దేవి అలియ...