భారతదేశం, నవంబర్ 7 -- నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు మధ్య డేటింగ్ పుకార్లు కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించకపోయినప్పటికీ, సమంత తాజాగా షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఇందులో ఈ ఇద్దరూ హగ్ చేసుకొని కనిపించారు.

సమంత తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ 'సీక్రెట్ అల్కెమిస్ట్' ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో హైలైట్‌గా నిలిచింది.

ఒక ఫోటోలో సమంత.. రాజ్ నిడిమోరును కౌగిలించుకుని పోజు ఇవ్వగా, రాజ్ కూడా ఆమె నడుము చుట్టూ చేయి వేసి కనిపించాడు. ఈవెంట్‌లో ఉన్న పలువురితో కలిసి దిగిన మరో ఫోటోలో రాజ్ సమంత వ...