భారతదేశం, జనవరి 14 -- కుర్రకారు హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె తన ప్రియుడు, రైటర్ రాహుల్ మోడీతో త్వరలోనే ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై శ్రద్ధా సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వారంలో పలు వెబ్ సైట్ల లో శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి కథనాలు వచ్చాయి. "అధికారిక ప్రకటన లేకపోయినా, శ్రద్ధా కపూర్ తన చిరకాల ప్రియుడిని ఉదయపూర్‌లో ఒక హెరిటేజ్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లాడబోతోంది. శ్రద్ధా పెళ్లి వార్త విన్న ఫ్యాన్స్ ఆనందంతో పాటు, హార్ట్ బ్రేక్ ఎమోషన్స్ వ్యక్తం చేస్తున్నారు" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.

దీన్ని చూసిన సిద్ధాంత్ కపూర్ ఆశ్చర్యపోతూ.. నవ్వు...