Hyderabad, మే 14 -- సమంత రూత్ ప్రభు కొన్నాళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ మధ్య తరచూ రాజ్ ఆమె ఇన్‌స్టా ఫొటోల్లో దర్శనమిస్తున్నాడు. దీంతో వీళ్ల ప్రేమ అఫీషియల్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం.

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పటి వరకూ ఒంటరిగానే ఉంది. ఇటు చైతూ మరో పెళ్లి చేసుకున్నా.. సామ్ సింగిల్ గానే కొనసాగుతోంది. అయితే కొన్నాళ్లుగా ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అతనితో కలిసి తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో ఆమె పని చేసింది.

ఈ మధ్యకాలంలో వీళ్లు తరచూ జంటగా కనిపిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యా...