భారతదేశం, ఫిబ్రవరి 23 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వస్తున్న రూమర్లు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ లండన్ వీధుల్లో చేతులు పట్టుకుని నడుస్తున్న ఒక వీడియో రెడ్డిట్ (Reddit) వేదికగా బయటకు వచ్చి వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కృతి సనన్ బ్రౌన్ కలర్ స్వెటర్, బ్లూ డెనిమ్స్ ధరించి స్టైలిష్‌గా కనిపించగా.. కబీర్ బహియా వైట్ టీ-షర్ట్, బ్లూ హూడీలో సింపుల్‌గా ఉన్నారు. కృతి సనన్, కబీర్ బహియా వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఎంతో సన్నిహితంగా నడుస్తూ కనిపించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, కృతి సనన్ అభిమానులు మాత్రం ఈ...