Hyderabad, జూలై 31 -- ప్రేమ పక్షులు మరోసారి కలిసి విహరించాయి. ఈసారి ముంబై వీధుల్లో ఫొటోగ్రాఫర్లకు దొరికిపోయారు. గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారని భావిస్తున్న సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు బుధవారం (జులై 30) ముంబైలో కలిసి కనిపించారు. అయితే వాళ్లు కారులోకి ఎక్కుతుండగా, ఫోటోగ్రాఫర్‌లను చూసి రాజ్ కోపంగా చూడటం వీడియోలో కనిపించింది. ఇద్దరి ప్రైవసీని దెబ్బ తీస్తున్నారన్నట్లుగా అతడు చూశాడు.

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తాజాగా మరోసారి ప్రేమలో పడిందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తనను డైరెక్ట్ చేసిన మన తెలుగు వాడు రాజ్ నిడిమోరుతోనే డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 30) ముంబైలో సమంత, రాజ్ కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.

ఒక క్లిప...