భారతదేశం, అక్టోబర్ 27 -- బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియా అబుదాబిలో జరిగిన UFC 321 ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కృతి పంచుకుంది. అందులో నటుడు వరుణ్ ధావన్ కూడా ఉన్నాడు.

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌తో అబుదాబి ఈవెంట్‌లో కృతి సనన్ సందడి చేసింది.ఒక ఫోటోలో కృతి కబీర్‌తో కలిసి సెల్ఫీకి నవ్వుతూ పోజులిచ్చింది. మరో చిత్రంలో వరుణ్‌తో కలిసి సరదాగా ముఖం పెట్టింది. ముగ్గురూ కలిసి ఉన్న చిత్రాలను కూడా కృతి పంచుకుంది. ఈ ఈవెంట్ కోసం, కృతి జాకెట్ కింద బ్లాక్ టాప్, డెనిమ్ ధరించింది. వరుణ్ మెరూన్ లెదర్ జాకెట్ కింద బ్లాక్ టీ-షర్ట్, ట్రౌజర్‌లో కనిపించాడు. కబీర్ వైట్ టీ-షర్ట్, పింక్ జాకెట్, డెనిమ్స్‌ను ఎంచుకున్నాడు.

ఈ చిత్రాలను పంచుకుంటూ కృతి.."అబుదాబిలో ఫైట్ నైట్ ఎనర్జీ (ఫైర్ ఎమోజి). ఈ ఇద్దర...