భారతదేశం, నవంబర్ 26 -- సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు వెళ్లే రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. దీని వలన ప్రయాణికులు ప్రైవేట్ బస్సు సర్వీసులపై ఆధారపడవలసి వస్తోంది. ఇదే ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి.

రవాణా శాఖ, రైల్వే విభాగాలు ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాయని, దీని వలన ప్రైవేట్ బస్సుల టికెట్లకు డిమాండ్‌ మరింత పెరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. జనవరి 9, 10 తేదీలు పండుగ సీజన్‌కు దగ్గరగా ఉండటంతో బుకింగ్‌లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఏపీఎస్ఆర్టీసీ 50 శాతం గరిష్టంగా అదనపు పండుగ ఛార్జీలను వ...