Hyderabad, ఆగస్టు 21 -- అంగరంగ వైభవంగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ తదితరులు హాజరయ్యారు.

వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌కు ఘన సన్మానం చేశారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు. అలాగే అశ్వనీదత్ చేతుల మీదుగా మోహన్ బాబు, మంచు విష్ణు పురస్కారాలు అందుకున్నారు.

అంతేకాకుండా మంచు మూడో తరం అవ్రామ్, తన తాత (మోహన్ బాబు మంచు) చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. వీరితో పాటు కో...