Bapatla district, ఆగస్టు 3 -- బాపట్ల జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను వెలికి తీశారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృత దేహాలను బయటకు తీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

గాయపడిన వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతులు ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.

ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారు...