భారతదేశం, ఏప్రిల్ 18 -- క్రైస్తవ మతాన్ని స్వీకరించేందుకు బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది.

కృష్ణా నది తీరం వెంబడి ఉండే భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక పాస్టర్‌తో కలిసి పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలోకి దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాను, తల కాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు(19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు.

స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పోలీసులు గాలింపు చేప...