Hyderabad, ఏప్రిల్ 13 -- ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం, మానసిక, శారీరక వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం వంటివి తప్పనిసరి. ఆహారం సంగతి పక్కన పెడితే వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడానికి సమయం, ఓపిక రెండూ కావాలి. ఈ రోజుల్లో ఇవి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ రోజంతా ఉరుకులు పరుగుల మీద గడుస్తుంది జీవితం. ఇలాంటి వారు శారీరక మానసిక ఆరోగ్యం కోసం పెద్దగా కష్టపడకుండా, ఎక్కువ సమయం పట్టకుండా బాడీ ట్యాపింగ్ టెక్నిక్ ను ఉపయోగించవచ్చని సోషల మీడియలో చాలా మంది చెబుతున్నారు. బాడీ ట్యాపింగ్ అనేది నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

బాడీ ట్యాపింగ్ అనేది మీ రోజువారీ బాధలకు సమాధానం లాంటి ఒక పురాతన ప్రత్యామ్నాయ వైద్యం. ఇది శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసి శరీరం తాజా...