భారతదేశం, జనవరి 4 -- సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఏదో కార్యక్రమంలో భాగంగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా వీడియోలో చూడవచ్చు. అయితే ప్రదక్షిణలు చేసే సమయంలో అక్కడే ఉన్న జనాలు కాస్త ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో బాడీగార్డ్ మీద రేవంత్ రెడ్డి చేయి చేసుకున్నారని ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలు స్పందిస్తున్నారు. చేతిలో అధికారం ఉందని ఇలా బాడీగార్డ్‌ను కొట్టడం ఏంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 'నీకు సెక్యూరిటీగా వాళ్లు చేసే జాబ్ ఎంతో కష్టపడి చదివితే వచ్చింది, కనీసం వాళ్ల చదువుకి అయినా మర్యాద ఇవ్వాలి. నువ్ కొడితే పడడానికి...