భారతదేశం, డిసెంబర్ 13 -- దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీని చూద్దామని వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలిగింది. తమ అభిమాన ఆటగాడికి చూసుకునే అవకాశం దక్కకపోవడంతో కోపంతో ఊగిపోయారు. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ చేశారు. బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. ఈ ఘటన పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ కు గురయ్యారు. మెస్సీకి ఆమె క్షమాపణ తెలిపారు.

కోల్‌కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపం పట్ల తాను తీవ్రమైన షాక్‌కు గురయ్యామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. మెస్సీని సరిగ్గా చూసే అవకాశం దక్కకపోవడంతో, కొందరు అభిమానులు ఆగ్రహానికి లోనై యువభారతి క్రీడాంగణంలోకి సీసాలు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మెస్సీకి, క్రీడాభిమానులకు తన క్షమాపణలు తెలియజేస్తున్నానని, తాను కూడా అదే కార్యక్రమానికి ...