భారతదేశం, జనవరి 8 -- మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు ఆధునీకరణ పనులు కొనసాగుతుండగానే. మరోవైపు భక్తుల రద్దీ మొదలైంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానంగా అందగా. ఇవాళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. రాష్ట్ర మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క. స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి జాతరకు రావాలని ఆహ్వానించారు.

ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న మహిళా మంత్రులకు. మాజీ ఎంపీ సంతోష్ రావు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసిన మంత్రులు. కాసేపు మాట్లాడారు. మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందించారు.

ఇంటికి వచ్చిన మంత్రులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి సాదర ఆహ్వానం లభించింది. 'బాగున్నారా.. అమ్మ' అంటూ మంత్రులకు క...