భారతదేశం, ఆగస్టు 2 -- యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. థియేటర్లకు వచ్చిన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో ఈ మూవీ అదరగొడుతోంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఇండియాలో రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీకి థియేటర్లు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ తో ఈ మూవీ జనాలకు మరింత రీచ్ అవుతోంది.

మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. కోట్లకు కోట్లు ఖాతాలో వేసుకుంటోంది. థియేటర్లలో రిలీజైన 8 రోజుల్లో ఈ సినిమా రూ.60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఇండియాలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. దేశంలో మరే యానిమేటెడ్ సినిమా సొంతం చేసుకుని రికార్డును మహావతార్ నరసింహా దక్కించుకుంది.

మరోవైపు అమెరికాలోనూ ఈ మూవీ క...