Hyderabad, ఆగస్టు 4 -- మహావతార్ నరసింహ.. ఇదో యానిమేటెడ్ మూవీ. కేజీఎఫ్, సలార్ లాంటి మూవీస్ తీసిన హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన సినిమా అని తప్ప ఇది రిలీజయ్యే ముందు పెద్దగా ఎలాంటి బజ్ లేదు. కానీ ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ఇండియాలోనే రూ.100 కోట్లకుపై గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ ఇతర యానిమేటెడ్ మూవీకి సాధ్యం కాని ఘనత ఇది.

ఓ యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ఎవరైనా ఊహించారా? అది కూడా ఇండియాలో ఇలాంటి సినిమాలకు పెద్దగా ఆదరణ లభించదు. కానీ మహావతార్ నరసింహ అన్ని అంచనాలనూ తలకిందులు చేసింది. sacnilk.com ప్రకారం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా వసూళ్లు రూ.108 కోట్లు కావడం విశేషం.

మన దేశంలో ఇప్పటి వరకూ ఏ ఇతర యానిమేటె...