భారతదేశం, జనవరి 10 -- పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ ను ఏలుతున్న ప్రభాస్ మరోసారి తన సత్తాచాటాడు. మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దూసుకెళ్తున్న ది రాజా సాబ్ తో మరోసారి బాక్సాఫీస్ రారాజుగా నిలిచాడు. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఓపెనింగ్ పరంగా ప్రభాస్ ఓ అద్భుతమైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ థియేటర్లో దుమ్ము రేపుతోంది. మిక్స్ డ్ టాక్ తోనూ కలెక్షన్లు కుమ్మేస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజైన ఈ మూవీకి భారీ ఓపెనింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజు రూ.112 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రాజా సాబ్ కలెక్షన్ల సెంచరీ కొట్టడంతో ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోక...