భారతదేశం, జనవరి 21 -- సంక్రాంతి సెలవులు అయిపోయినా, వీక్ డేస్ లోనూ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి క్రేజ్ కొనసాగుతోంది. కలెక్షన్లు కాస్త తగ్గినా మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఇండియాలో 9 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో ఇక్కడ చూసేద్దాం.

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 12న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొమ్మిదో రోజు (జనవరి 20) ఇండియాలో రూ.5.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్లు.

సక్నిల్క్ ప్రకారం మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇప్పటివరకూ, 9 రోజుల్లో కలిపి ఇండియాలో రూ.171 కోట్లకు పైగా వసూలు చేసింది. మన శంకర వర ప్రసాద్ గార...