భారతదేశం, డిసెంబర్ 28 -- సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఒకప్పుడు ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని నిర్మాతలు భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కంటెంట్ లో దమ్ముంటే 'A' రేటింగ్ సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన టాప్ 'A' రేటింగ్ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. తాజాగా ధురంధర్ సినిమా రూ.1000 కోట్ల మార్క్ దాటి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

గతంలో కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉండేది. కానీ నేటి యువత "రా అండ్ రస్టిక్" కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అత్యంత హింస, బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.

తాజాగా ధురంధర్ మూవీ రూ.1000 కోట్ల మార్క్ దాటింది. సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్ అందుకొని ...