భారతదేశం, నవంబర్ 3 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాక్సాఫీస్ ను ఏలుతోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలన్నీ వరుసగా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటి దూసుకెళ్తున్నాయి. 2025లో రష్మిక మందన్న నటించిన నాలుగు సినిమాల వసూళ్లు రూ.100 కోట్లు దాటేశాయి. రీసెంట్ హారర్ థ్రిల్లర్ థామా ఈ క్లబ్ లో చేరింది.

ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన థామా చిత్రం భారతదేశంలో మంచి విజయాన్ని సాధిస్తోంది. సక్నిల్క్ ప్రకారం థామా ఇప్పటివరకు ఇండియాలో రూ.119.65 కోట్లు సంపాదించింది. ఈ చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.

థామా ఫస్ట్ వీక్ లోనే ఇండియాలో రూ.108.4 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ హిందీలో రూ.107.52 కోట్లు, తెలుగులో రూ.88 లక్షలు తొలి వారంలో దక్కిచుకుంది. 11 వ రోజు రూ.3 కోట్లు, 12 రోజు రూ.4.4 కోట...