భారతదేశం, డిసెంబర్ 8 -- రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.100 కోట్లు దాటేశాయి. రూ.150 కోట్లకు చేరువయ్యాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్' డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది ఈ సినిమా.

దురంధర్ కలెక్షన్లు

దురంధర్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. తొలి రోజు వసూళ్లలో 'సయ్యారా'ను సులభంగా అధిగమించిన ఈ స్పై థ్రిల్లర్ దురంధర్.. ఫస్ట్ వీకెండ్ లోనే వంద కోట్లను కొల్లగొట్టింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం ఇండియాలో దురంధర్ మూడు రోజుల్లో రూ.118 కోట...