భారతదేశం, ఆగస్టు 3 -- కన్నడ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'సు ఫ్రమ్ సో' (Su From So) మూవీ రికార్డులు తిరగరాస్తోంది. కన్నడలో రికార్డు కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ తో జైజేలు కొట్టించుకుంటోంది. వసూళ్ల సునామీని చూపిస్తోంది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ తెలుగులోనూ థియేటర్లకు రాబోతోంది.

జులై 25, 2025న థియేటర్లలో రిలీజైంది కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో'. కేవలం రెండు కోట్ల రూపాయాల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 10 రోజుల్లోనే ఇండియాలో రూ.33.7 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. గ్రాస్ వసూళ్లు చూసుకుంటే రూ.40 కోట్లు దాటాయి. ఈ మూవీ క్రేజ్ కారణంగా ఆగస్టు 1న మలయాళంలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో డబ్ చేయ...