భారతదేశం, మే 15 -- వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్శిటీలో చదువుతున్న భారత్ కు చెందిన పోస్ట్ డాక్టోరల్ ఫెలో బదర్ ఖాన్ సూరిని విడుదల చేయాలని అమెరికా న్యాయమూర్తి ఆదేశించారు.
బదర్ ఖాన్ సూరిని ఫెడరల్ ఏజెంట్లు రెండు నెలల క్రితం వర్జీనియాలోని అతని ఇంట్లో అరెస్టు చేసి టెక్సాస్ లో నిర్బంధించారు.
బదర్ ఖాన్ సూరిని తక్షణమే విడుదల చేయాలని, టెక్సాస్ నుంచి వర్జీనియాలోని తన భార్య, ముగ్గురు పిల్లల వద్దకు తిరిగి రావడానికి అనుమతించాలని జిల్లా జడ్జి పాట్రిసియా గైల్స్ బుధవారం ఆదేశించారు.
'జడ్జి మాటలు విని నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి' అని సూరి భార్య మాఫేజ్ సలేహ్ పేర్కొన్నారు. తన భర్త తరఫున కోర్టులో వాదిస్తున్న సెంటర్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ (సీసీఆర్) విడుదల చేసిన ప్రకటనలో ఈమేరకు ప్రస్తావించారు.
పాలస్తీనాలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడటం నేరం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.