భారతదేశం, జనవరి 7 -- ఇటీవలే ముగిసిన హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' (Bigg Boss 19) కంటెస్టెంట్లు దుబాయ్‌లో వాలిపోయారు. షో గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో విన్నర్ గౌరవ్ ఖన్నా, ఫైనలిస్టులు, ఇతర కంటెస్టెంట్లు సందడి చేశారు. అయితే వీరంతా పార్టీ వేదికకు వెళ్లేందుకు ఒక బస్సులో ప్రయాణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ 19 షో ముగిశాక అందరూ కలిసి ఇలా చిల్ అవ్వడం ఫ్యాన్స్‌కి నచ్చినా.. అందరూ కలిసి బస్సులో వెళ్లడాన్ని చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దుబాయ్ పార్టీకి వెళ్లే క్రమంలో కంటెస్టెంట్లందరూ ఒకే బస్సులో కిక్కిరిసి ప్రయాణించారు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

"అంబానీ పెళ్లిలో బాలీవుడ్ స్టార్లే బస్సుల్లో వెళ్లారు.. వీళ్లెంత?" అని ఒకరు ...