భారతదేశం, మే 15 -- ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. లక్నోలోని మోహన్ లాల్ గంజ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. లక్నో శివార్లలోని కీలక రహదారి కిసాన్ పథ్ లో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బస్సు బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్ లోని బెగుసరాయ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మోహన్ లాల్ గంజ్) రజనీష్ వర్మ తెలిపారు.

బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే,...