భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంట 44 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

భారత వాతావరణ శాఖ ప్రకారం దిత్వా తుపాను వల్ల డిసెంబర్ 1న తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో డిసెంబర్ 1, 2వ తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో డిసెంబర్ 1వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తమిళనాడు, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో మెరుపులతో కూడిన పిడుగులు పడనున్నాయి.

సోమవారం నెల్లూరు, తిరుపతి, జిల్లాల్లో అ...