భారతదేశం, నవంబర్ 9 -- రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన బీవీఎస్ రవి తర్వాత దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా హీరో తిరువీర్ నటించిన రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సక్సెస్ మీట్‌కు బీవీఎస్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే, టీనా శ్రావ్య హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సందీప్ అగరం, అష్మిక రెడ్డి కలిసి నిర్మించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ నవంబర్ 7న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే నవంబర్ 8న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో అంటూ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన డైరెక్టర్ బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు, రచయిత, నటుడు బీ...