Hyderabad, జూలై 24 -- క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, ఆర్‌జే మహ్వష్ ల మధ్య ప్రేమాయణం గురించి చాలా కాలంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఈ రూమర్లను నిరంతరం ఖండిస్తున్నప్పటికీ.. తరచుగా కలిసి కనిపించడం అభిమానులను మరోలా ఆలోచించేలా చేస్తోంది. ఇప్పుడు, లండన్‌లో జరిగిన చహల్ పుట్టినరోజు వేడుకల్లో మహ్వష్‌ను చహల్ ఆత్మీయంగా కౌగిలించుకున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

క్రికెటర్ చహల్ తన 35వ పుట్టినరోజును బుధవారం (జులై 23) లండన్‌లో జరుపుకున్నాడు. ఒక ఫొటోగ్రాఫర్ పంచుకున్న వీడియోలో ఈ వేడుకలోని కొన్ని హృదయాన్ని హత్తుకునే క్షణాలు రికార్డయ్యాయి. చహల్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అంతేకాదు తన ప్రేయసి మహ్వష్‌ను గట్టిగా కౌగిలించుకున్నాడు. చహల్ వేడుకలను ఆస్వాదిస్తున్నప్పుడు మహ్వష్ చిరునవ్వు చిందిస్తూనే కనిపించింది. తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ కూడ...