Hyderabad, ఏప్రిల్ 22 -- అధిక బరువు సమస్యతో ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారు. అయితే జపనీస్ మాత్రం మెరుపుతీగల్లా సన్నగా ఉంటారు. ఎంతో ఆనందంగా కనిపిస్తారు. దీనికి కారణం వారు పాటించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లే.

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి వివిధ దేశాల ప్రజలకు ఎన్నో అలవాట్లు ఉంటాయి. కానీ ఫిట్‌నెస్ కోసం, బరువు తగ్గేందుకు మీరు జపనీస్ పాటించే అలవాట్లు మాత్రం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

నిజానికి, జపనీయులు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక మంచి అలవాట్లను పాటిస్తారు. జపనీయులు కేవలం తాజాగా వండిన ఆహారాన్ని తినేందుకే ఇష్టత చూపిస్తారు. అంతేకాకుండా, వారు బరువు పెరగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. జపనీయుల జీవనశైలికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. వాటిని పాటిస్తే మనం కూడా సన్నగా మెరుపుతీగలా ఉండవచ్చు. బరువు...