భారతదేశం, జూలై 15 -- అనంత్ అంబానీ, నీతా అంబానీ ఇద్దరి బరువు తగ్గడంలో ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా కీలక పాత్ర పోషించారు. అతని మార్గదర్శకత్వంలో అనంత్ కేవలం 18 నెలల్లో 108 కిలోలు తగ్గగా, నీతా 18 కిలోలు తగ్గారు. ఫిట్నెస్, బరువు తగ్గడానికి సంబంధించిన విలువైన విషయాలను వినోద్ తరచూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంటాడు.

ఫ్యాట్ ను వేగంగా బర్న్ చేసే విషయంలో, బరువు తగ్గే విషయంలో సరైన ఫలితాలను సాధించడానికి కార్డియో ఏ సమయంలో చేయాలో ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా తన ఇన్ స్టా పోస్ట్ లో వెల్లడించాడు. కార్డియో ను రెగ్యులర్ వర్క్ ఔట్స్ కు తరువాత చేయాలా? లేదా ముందే చేయాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుందని తెలిపారు. ''కార్డియో ఎప్పుడు చేయాలి? "వ్యాయామానికి ముందు చేయాలా? లేదా తరువాత చేయాలా? కార్డియో చేయడానికి సరైన సమయం గురించి గందరగోళంగా ఉందా? నేను ఈ రీల్ లో...