Hyderabad, జనవరి 29 -- బయట నుంచి ఇంటికి వచ్చిన తరువాత మొదట కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లో అడుగుపెట్టమని చెబుతారు పెద్దలు. ఎంతో మంది ఇప్పటికీ కాళ్లు శుభ్రం చేసుకున్నాకే ఇంట్లోకి వస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి బూట్లు లేదా చెప్పులతో నడిచి బయటి నుండి ప్రతికూల శక్తిని ఇంట్లోకి తీసుకురావడానికి పనిచేస్తాయని పెద్దల నమ్మకం. అందుకే కాళ్లు శుభ్రం చేయమని చెబుతారు. కేవలం వాస్తుపరమైన నమ్మకాలే కాదు సైన్సుపరంగా కూడా కాళ్లు శుభ్రం చేసుకుంటేనే మంచిదని చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ముందు, రాత్రి పడుకునే ముందు ఎల్లప్పుడూ పాదాలను కడుక్కోవాలని సలహా ఇస్తుంది. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరిస్తోంది.

ఆయుర్వేదంలో, బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాదాలను కడగడం దినచర్యలో భాగమని చెబుతోంది. అందుకే ఇలా చేయడం వల్ల పాదాలు శు...