Telangana,hyderabad, జూన్ 18 -- తమ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడారు.

బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. తెలంగాణ హక్కులను రక్షించే పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలకు సూచించారు. తెలంగాణపై జరిగే ఏ అన్యాయాన్నీ సహించమని స్పష్టం చేశారు.

"మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం...