భారతదేశం, నవంబర్ 8 -- గత కొంతకాలంగా పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం. అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కేంద్రానికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఏపీలోని వామపక్ష పార్టీలతో పాటు పలు ప్రజాసంఘాలు కూడా ఈ ప్రాజెక్ట్ పై తీవ్రస్థాయిలో అభ్యంతరాలను వ్యక్తపరిచాయి.

మరోవైపు ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కూడా కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కూడా పేర్కొంది. ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలని వెల్లడించింది. పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టుపై ఒక్క తెలంగాణ నుంచే కాదు. పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యతిరేకత మొదలైంది. గోదావరికి వరద సమయంలో రోజుకు రెండు టీఎ...