Andhrapradesh,telangana, అక్టోబర్ 11 -- ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని హరీశ్ రావ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన. బనకచర్ల తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారబోతున్నదని వ్యాఖ్యానించారు. కేంద్ర బీజేపీ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోతోదని. అయినా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నరారని ఆరోపించారు. ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు.

"గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేసింది. ఇదే విషయంపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025...