భారతదేశం, జనవరి 1 -- 200 టీఎంసీల గోదావరి నదీ నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై జనవరి 5వ తేదీన విచారణ జరగనుంది.

గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని. ఈ పిటిషన్ పై జనవరి 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్ర...