Telangana, జూలై 30 -- రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీ లేని పోరాటాలు మరింత ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని సూచించారు.

రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ మీద ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Published by HT Digital Content Services wit...