భారతదేశం, మే 25 -- రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలనొప్పిగా మారాయి. ఈ నెల 21 నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలతో ప్రక్రియ ప్రారంభించగా.. తొలిరోజు నుంచే విద్యాశాఖ తీసుకొచ్చిన వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. కొన్నిచోట్ల గందరగోళానికి గురవతున్నారు. ఇప్పటికే అవే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ఇచ్చిన గడువు అయిపోతుండటం.. మరోవైపు వెబ్‌సైట్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించకపోవడంతో.. టీచర్లు అవస్థలు పడుతున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌లను సంప్రదించినా.. సమస్యలను తాము పరిష్కరించలేమని, కేంద్ర కార్యాలయానికి కాల్‌ చేయాలని చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని విద్యాశాఖ అధికారులు గత రెండు, మూడు నెలల నుంచి చెబుత...