Hyderabad, సెప్టెంబర్ 9 -- బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఇది. ఈ పండుగను తొమ్మిది రోజులు పాటు అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తోంది? తేదీలతో పాటు ఏ రోజు ఏ బతుకమ్మను ఆరాధించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నుంచి మొదలవుతుంది. తొమ్మిది రోజులు పాటు ఘనంగా ఈ పండుగను జరుపుతారు. ఏ రోజున, ఏ రూపంలో బతుకమ్మను ఆరాధించాలి? ఈ పండుగ విశిష్టత ఏమిటి? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

మహాలయ అమావాస్య నుంచి పండుగ మొదలవుతుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకోవాలి. ఎంగిలిపూల బతుకమ్మ అంటే బతుకమ్మను తయారు చేయడానికి వాడే పూలను ముందు రోజు తెచ్చుకొని వాడిపోకుండా నీళ్లు వేసి, తర్వాత రోజు బతుకమ్మను పేరుస్తారు.

అందుకే ఎంగిలి ...