భారతదేశం, నవంబర్ 25 -- ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' (హెచ్​యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్​ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఈ హెచ్​యూడీ ఫీచర్ వల్ల డ్రైవర్లు రోడ్డుపై దృష్టి మరల్చకుండానే కారు వేగం, మైలేజ్, నావిగేషన్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు. కొందరు దీన్ని స్టైలిష్​గా భావించినప్పటికీ, సరైన రీతిలో కారులో అమర్చితే, డ్రైవర్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అధిక ధరల శ్రేణిలోకి వెళ్లకుండానే ఈ సౌలభ్యాన్ని కోరుకునే కొనుగోలుదారుల కోసం ఇప్పుడు టయోటా, మారుతీ సుజుకీ వంటి ప్రముఖ సంస్థలు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్‌లలో కూడా ఈ హెచ్​యూడీ ఫీచర్‌తో కూడిన వేరియంట్‌లను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ హెడ్స్-...