భారతదేశం, జూలై 3 -- ఒప్పో తన కొత్త బడ్జెట్ టాబ్లెట్ - ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ను భారతదేశంలో లాంచ్ చేసింది. 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత స్కిన్, 9,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, వై-ఫై వేరియంట్ల సపోర్ట్ తో ఈ కొత్త ట్యాబ్లెట్ వస్తుంది.

ఒప్పో ప్యాడ్ ఎస్ఈలో 11 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ టాబ్లెట్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇది కంటెంట్ స్ట్రీమింగ్ చూడటానికి అనువైనది. మీడియాటెక్ హీలియో జీ100 ప్రాసెసర్, ఆర్మ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ కొత్త ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 6/8 జీబీ ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 128/256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ను అందించారు.

ఒప్పో ప్యాడ్ ఎస్ఈలో 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 1080 పి 30 ఎఫ్పిఎస్ వీ...