భారతదేశం, ఏప్రిల్ 13 -- మీరు ఫోటోగ్రఫీ కోసం ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయకూడదని ఆలోచిస్తున్నారా? మీ కోసం మార్కెట్లో చాలా ఫోన్లు వెయిట్ చేస్తున్నాయి. మీకు రూ. 20,000 కంటే తక్కువ ధరకే మంచి ఆప్షన్స్ ఉన్నాయి. . వీటిలో రియల్‌మీ నార్జో 80 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్25 ప్రో, రియల్‌మీ పీ3 మొబైల్స్ ఈ బడ్జెట్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల గురించి సమాచారాన్ని చూద్దాం..

20,000 రూపాయల బడ్జెట్‌లో ఒప్పో ఎఫ్25 ప్రో స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపిక. ఇది ఓఐఎస్ సపోర్ట్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్ఈడీ డిస్‌ప్లేను 2412 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ రక్షణను ...