భారతదేశం, ఫిబ్రవరి 27 -- మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలపై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ధర విషయంలో కూడా ఇవి సామాన్య ప్రజల బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటాయి. మీ బడ్జెట్‌ ప్రారంభం కూడా 8 లక్షల రూపాయలకు అటు ఇటుగా ఉంటే.. కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలనుకుంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 5 కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కూడా ఈ సెగ్మెంట్‌లో ఒక అద్భుతమైన ఎంపిక. భారతీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుండి టాప్ మోడల్‌లో రూ.15.57 లక్షల వరకు ఉంటుంది. ఫీచర్స్ విషయంలో ఈ ఎస్‌యూవీలో 6-ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ కారులో 10.25-ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే కూడా లభిస్తుంది.

ఈ సెగ్మెంట్‌లో కియా సోనెట్ ఒక ప్రసిద్ధ కారు. భారతీయ...