భారతదేశం, మే 5 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ అనుకూలం దీనికి కారణం. చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలపై సందేహంతో ఉంటున్నారు. భారతదేశంలో బాగా అమ్ముడవుతున్న రూ.10 లక్షల లోపు ధర గల ఈవీ కార్లు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

ఎంజీ కామెట్ ఈవీ నగరంలో, చుట్టుపక్కల రోజువారీ ప్రయాణాలకు తగిన కారు. ఎంజీ కామెట్ ఈవీ భారతదేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు. దీని ధరలు రూ. 7.98 లక్షల నుండి రూ. 9.98 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కామెట్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ రేంజ్ ప్రయాణించగలదు. దీని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BAS) ఆప్షన్‌కో వస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. నగర ట్రాఫిక్‌లో కూడా స...