భారతదేశం, మే 30 -- కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా, బడ్జెట్ తో పని లేకుండా ఏ సినిమా అయినా పాన్ ఇండియా, ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అవుతోంది. ఇక ఓటీటీలు వచ్చాక సినిమాను చూసేందుకు భాషతో పనే లేకుండా పోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి కంటెంట్ తో, తక్కువ బడ్జెట్ తో థియేటర్లకు వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ, తుడరుమ్ సినిమాలు దుమ్మురేపాయి. ఈ రెండు సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒకటే.

సూపర్ స్టార్ రజనీకాంత్, టాప్ డైరెక్టర్ రాజమౌళితో పాటు సూర్య, నాని లాంటి వాళ్ల ప్రశంసలు ఓ చిన్న సినిమా అందుకుంది. ఇప్పుడు అదే మూవీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫిల్మే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. శశికుమార్, సిమ్రాన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ థియేటర్లను షేక్ చేస్తోంది. కేవలం సుమారు రూ.16 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ ఏకంగా రూ...