భారతదేశం, డిసెంబర్ 6 -- సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఇట్స్ ఓకే గురు ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, ఇట్స్ ఓకే గురు సినిమా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అతిథిగా డైరెక్టర్ మెహర్ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. "నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ గారు మళ్లీ వెనక్కి తి...