భారతదేశం, ఆగస్టు 4 -- హోండా తన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ శ్రేణిని కొత్త మోడల్ - షైన్ 100 డీఎక్స్​తో విస్తరించింది. ప్రస్తుతం ఉన్న షైన్ 100 మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా విడుదలైన ఈ సరికొత్త వేరియంట్.. రోజువారీ ప్రయాణ సౌలభ్యాన్ని పెంచే అప్​డేట్స్​ని కలిగి ఉంది. షైన్ 100 డీఎక్స్​ కొత్త ఫీచర్లు, కాస్మెటిక్ మార్పులతో బడ్జెట్-ఫ్రెండ్లీ రైడర్‌లకు మెరుగైన విలువను, సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో వస్తుంది. రెగ్యులర్ హోండా షైన్ 100తో పోలిస్తే షైన్ 100 డీఎక్స్​ ఎలా నిలుస్తుందో ఇక్కడ వివరంగా చూద్దాము..

మొదటి చూపులో రెండు బైక్స్​ ఒకే ప్రాథమిక సిల్హౌట్, కమ్యూటర్-ఆధారిత నిష్పత్తులను కలిగి ఉంటాయి. డీఎక్స్​ వేరియంట్​ మాత్రం దాని అప్పీల్​ని మెరుగుపరచడానికి కొన్ని అప్‌డేట్‌లను పొందింది. హెడ్‌ల్యాంప్‌ను క్రోమ్ బెజెల్, క్రోమ్‌తో ఫినిష్ చేసిన మఫ్లర్ గార్డ్, ...