భారతదేశం, ఆగస్టు 30 -- భారత మార్కెట్​లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీ నెలకొంది. ఈ విభాగంలో రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ కీలకమైన ప్లేయర్స్. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, వాటి మధ్య డిజైన్, ఫీచర్లు, ధర విషయంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇటీవల రెనాల్ట్ తన కైగర్‌ను కొన్ని కొత్త అప్‌డేట్‌లతో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ తనదైన శైలిలో మార్కెట్‌లో దూసుకెళ్తోంది. పైగా, ఈ రెండు ఎస్​యూవీలు కూడా బడ్జెట్​ రేంజ్​లో, మిడిల్​క్లాస్- ఫ్యామిలీకి బెస్ట్​ ఛాయిస్​గా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కొనాలి?

2025 రెనాల్ట్​ కైగర్​ మరింత పదునైన గ్రిల్, కొత్త 2డీ లోగో, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ ట్రిమ్, అప్‌డేటెడ్ బంపర్స్, కొత్త 16-ఇంచ్​ అల్లాయ్ వ...