Hyderabad, ఏప్రిల్ 28 -- ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదా? మధ్యాహ్నం లంచ్‌కి బోర్ కొట్టకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే బఠానీ రైస్ ఒక సూపర్ ఆప్షన్! ఇది చాలా త్వరగా అయిపోతుంది, రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరూ ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ కోసం బఠానీ రైస్‌ను సిద్ధం చేసుకోండి!

బఠానీ రైస్ తేలికగా ఉంటుంది కాబట్టి ఉదయం తినడానికి సెట్ అవుతుంది. అలాగే కడుపు నింపుతుంది కాబట్టి లంచ్‌కి కూడా పర్ఫెక్ట్ గా పని చేస్తుంది! మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దలు వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ఇంకా ఆలోచిస్తారెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళిపోదాం పదండి.

దీనికి తోడుగా రైతా లేదా మీకు నచ్చిన ఏదైనా కర్రీని రెడీ చేసుకున్నారంటే. ఆహా అద్భుత...